బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చల్గల్ వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బియ్యం ధరలను కృత్రిమంగా పెంచే వారిపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రసూనాంబ, పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, డీసీఓ మనోజ్, డీసీఎస్‌ఓ జితేందర్‌రెడ్డి, ఎమ్మార్వో హకీం, ఏఓ తిరుపతి నాయక్, సీఈఓ వేణు పాల్గొన్నారు.