BREAKING
ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు! తల్లి దండ్రులను పోషించని కొడుకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పాతనగరం కాదు.. 'ఒరిజినల్ సిటీ

సాగునీటి ప్రాజెక్టుపై సమీక్ష

Select Suryaa Now
సాగునీటి ప్రాజెక్టుపై సమీక్ష

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 36 సాగునీటి ప్రాజెక్టులను ,ఆ రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా లక్ష్యాలను సాధించేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీటి సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల డైరెక్టర్లు, జలవనరుల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.