గుండాల గ్రామానికి అభివృద్ధి కళ.. రూ.36 లక్షల పనులు ప్రారంభం
చేవెళ్ల : గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో రూ.36 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన భూగర్భ మురుగు కాలువను ప్రారంభించారు. దీంతో గ్రామంలో ఏళ్లుగా నెలకొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. అలాగే రూ.6 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఎత్తైన విద్యుత్ దీప స్తంభాలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రధాన వీధులు, కూడళ్లలో రాత్రివేళ వెలుతురు అందుబాటులోకి రానుంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు రాత్రి వేళల్లో రాకపోకలు సులభతరం కానున్నాయి.
అదేవిధంగా గ్రామానికి నూతనంగా మంజూరైన చౌక ధరల దుకాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామస్తులు రేషన్ సరుకుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పనున్నాయి. గ్రామంలోనే నిత్యావసర సరుకులు పొందే అవకాశం కలగనుంది.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సీనియర్ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.