ఆంజనేయ స్వామి హుండీ ఆదాయం రూ.3.12లక్షలు
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణంలో వెలసిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.3,12,733 వచ్చినట్లు కార్యనిర్వాహణాధికారి వేణునాథ్ రెడ్డి తెలిపారు. బండిఆత్మకూరు కార్యనిర్వాహణాధికారి ఎ. నాగప్రసాద్ పర్యవేక్షనలో లెక్కించినట్లు తెలిపారు. ఇఓ వేణునాథ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే రూ.82,289 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ వి.అనిల్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు, బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, రామస్వామి సేవ సమాజ్ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
మధుబాబు, నంద్యాల బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా