యాదమరి యూనియన్ బ్యాంకులో రూ.2 లక్షల బీమా క్లెయిమ్ అందజేత అకాల మరణం చెందిన ఖాతాదారుడి కుటుంబానికి ఆర్థిక భరోసా – నామినీకి చెక్కు అందజేత
యాదమరి మేజర్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ద్వారా యాదమరి యూనియన్ బ్యాంకు ఖాతాదారుడి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక భరోసా లభించింది. యాదమరికి చెందిన కె. గణేష్ బాబు అకాల మరణం చెందడంతో, ఆయన నామినీ కె. ప్రమీలకు రూ.2 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును యాదమరి యూనియన్ బ్యాంకు శాఖ మేనేజర్ రంగప్రసాద్ మంగళవారం అందజేశారు.ఈ సందర్భంగా శాఖ మేనేజర్ మాట్లాడుతూ, ఫినో పేమెంట్స్ బ్యాంకు సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక బ్యాంకింగ్ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ప్రీమియంతో లభించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాలు ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక అండగా నిలుస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫినో బ్యాంకు రాష్ట్ర అధిపతి కొప్పోలు ఏడుకొండలరావు, క్లస్టర్ అధిపతి అనిల్ కుమార్, శిక్షణ మేనేజర్ శివరామ్, ఝాన్సీతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవా కేంద్రాల ప్రతినిధులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రజలందరూ తమ సమీపంలోని యూనియన్ బ్యాంకు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ బీమా పథకాలలో నమోదు చేసుకోవాలని కోరారు.
యాదమరి రిపోర్టర్ ఫైరూజ్ బాషా