BREAKING
ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పాతనగరం కాదు.. 'ఒరిజినల్ సిటీ కూటమి ప్రభుత్వ అరాచకాలపై అనంతలో సిపిఐ, సిపిఎం నిరసన ర్యాలీ పటాన్‌చెరు నుంచి ఈపీఎఫ్ కార్యాలయం తరలించొద్దు సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి జిజిహెచ్ సూపరింటెండెంట్ ఘన సన్మానం మాగుంట ను కలసినదర్శి జెడ్పిటిసి. 34 ఏళ్ల సేవకు తోటి హోంగార్డుల ఆపన్నహస్తం: పదవీ విరమణ పొందిన హోంగార్డుకు రూ. 4.95 లక్షల ఆర్థిక సాయం

కూటమి అక్రమాలను అధిగమించి వైఎస్సార్‌సీపీ పోరాడింది: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి

Select Suryaa Now
కూటమి అక్రమాలను అధిగమించి వైఎస్సార్‌సీపీ పోరాడింది: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అక్రమాలు, అరాచకాల మయంగా మారాయని వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ కేడర్‌ ఎంతో కసితో, ధైర్యంగా పోరాటం చేసిందని ఆయన కొనియాడారు. వైయస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, నగర మేయర్‌ రమేష్‌ గౌడ్‌లతో పాటు పలు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిశారు. స్థానిక ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.

​2024తో పోలిస్తే వైఎస్సార్‌సీపీకి పెరిగిన ఓటింగ్ శాతం

సమావేశం అనంతరం వైఎస్‌ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రజలంతా గమనించారని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని మండిపడ్డారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వైయస్సార్‌సీపీ ఓటింగ్‌ శాతం పెరగడం విశేషమన్నారు. ఒకవేళ ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగి ఉంటే పార్టీకి ఇంకా భారీగా ఓటింగ్ నమోదయ్యేదని స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం పెరిగితే తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే భయంతోనే చంద్రబాబు సరికొత్త తరహా అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. వైయస్సార్‌సీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ అసత్యాలు ప్రచారం చేస్తూ, ఇప్పుడు తాను చేస్తున్న దౌర్జన్యాలను సమర్థించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యం గురించి ఆయన నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్