హెచ్.ఎన్.ఎస్.ఎస్. నీటి విడుదల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 11: హెచ్.ఎన్.ఎస్.ఎస్. (హంద్రీ-నీవా సుజల స్రవంతి) కాల్వ ద్వారా నీటి విడుదల ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు…
బుధవారం నందికొట్కూరు మండలంలోని మల్యాల పంప్ హౌస్ ను కలెక్టర్ పరిశీలించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా మల్యాల పంప్ హౌస్, ఫోర్ బే, లింక్ ఛానల్ ద్వారా నీటి సరఫరా జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తూ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మల్యాల పంప్ హౌస్ వద్ద మూడు పంపుల ద్వారా 920 క్యూసెక్కుల నీటిని హెచ్.ఎన్.ఎస్.ఎస్. కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కి వివరించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుండగా, ఇప్పటివరకు మొత్తం 21 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.. ముచ్చుమర్రి నుంచి మల్యాల ఫోర్ బే కు 17 కిలోమీటర్ల లింక్ ఛానల్ ద్వారా నీరు చేరుతుందని, అక్కడి నుంచి పంపింగ్ ప్రక్రియ ద్వారా హెచ్.ఎన్.ఎస్.ఎస్. కాల్వలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. హెచ్.ఎన్.ఎస్.ఎస్. నీటి విడుదలకు సంబంధించిన మొత్తం ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంపింగ్ వ్యవస్థ, కాల్వ ద్వారా నీటి విడుదల, నీటి సరఫరా విధానాన్ని పరిశీలించారు.
కార్యక్రమంలో హెచ్.ఎన్.ఎస్.ఎస్ ఎస్ఈ రాజన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు క్రిష్టన్న, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.