BREAKING
చింతలమానేపల్లిలో K Tech 1325HD CNC రూటర్ మెషిన్ ప్రారంభం కూటమి అక్రమాలను అధిగమించి వైఎస్సార్‌సీపీ పోరాడింది: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండో ప్రెగ్నెన్సీతో మెరిసిపోతున్న కియారా అద్వానీ.. కాఫీ విత్ కరణ్ షోలో బేబీ బంప్‌తో సందడి! హాలీవుడ్ ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ జోబ్ సెర్నీ కన్నుమూత.. 78 ఏళ్ల వయసులో మృతి ఎనిమిదేళ్ల వయసులోనే రోజువారీ కూలీగా పని.. చదువుకోలేకపోయానంటూ మునావర్ ఫరూఖీ భావోద్వేగం! కష్టాల్లో ఉన్నవారిని వేధించడం అమానుషం.. రేణు దేశాయ్ భావోద్వేగ పోస్ట్ వైరల్! నకిలీ పత్రాలతో ICICI బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా.. సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం సల్మాన్ ఖాన్ పడిన శ్రమ, త్యాగాలు నాకు తెలుసు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి భావోద్వేగ ట్వీట్ ఫేక్ పోస్టులపై స్పందించిన రోహిత్ శెట్టి.. ఆ సోషల్ మీడియా ఖాతాలతో తనకు సంబంధం లేదంటూ క్లారిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి* రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి కుందుర్పి జడ్పీటీసీగా ధ్రువీకరణ పత్రం అందుకొన్న  ప్రభావతి.*  హెచ్.ఎన్.ఎస్.ఎస్. నీటి విడుదల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* హాలీవుడ్ ప్రముఖ నటుడు స్టేసీ కీచ్ కన్నుమూత.. 85 ఏళ్ల వయసులో తీవ్ర గుండెపోటుతో మృతి

జాతీయ మూల్యాంకనానికి విద్యార్థులను సిద్ధం చేయాలి ఉపాధ్యాయులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన

Select Suryaa Now
జాతీయ మూల్యాంకనానికి విద్యార్థులను సిద్ధం చేయాలి  ఉపాధ్యాయులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన

 

సూర్య – పెద్దపల్లి:

జాతీయ స్థాయిలో నిర్వహించే PARAKH మూల్యాంకనంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థానం సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ సముద్రాల వంశీ మోహనాచార్యులు రూపొందించిన PARAKH ప్రత్యేక అభ్యసన దీపికను బుధవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను ముందస్తు ప్రణాళికతో జాతీయ స్థాయి మూల్యాంకనానికి సిద్ధం చేయాలని, వినూత్న బోధనా పద్ధతులతో వారి అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని అన్నారు. గత రెండేళ్ల ప్రశ్నపత్రాలు, జాతీయ స్థాయి అభ్యసన ప్రమాణాలను పరిశీలించి 25 ముఖ్యమైన అంశాలపై వందలాది ప్రశ్నలతో ఈ అభ్యసన దీపికను రూపొందించడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయుడు తన సొంత నిధులతో పుస్తకాన్ని ముద్రించి విద్యార్థులకు అందించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ షేక్ తదితరులు పాల్గొన్నారు.