టిప్పర్ ఢీకొని మహిళ మృతి
నేరేడుచర్ల, మేజర్ న్యూస్ :మండల పరిధిలోని జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొమ్మిలూరు గురమ్మ (భర్త వెంకన్న) అక్కడికక్కడే మృతి చెందారు.మిర్యాలగూడ నుంచి ఖమ్మం జిల్లా పల్లెగూడెంలోని తమ స్వగ్రామానికి భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును దాటుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఓవర్‌టేక్ చేస్తూ వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో గురమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు బేడా బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందినవారు. చిలక జోష్యం చెప్పడం వారి కుటుంబ వృత్తి. గురమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో పిల్లలు మాతృవియోగానికి గురికావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.