చిన్నారుల చేతుల మీదుగా పేద విద్యార్థులకు తినుబండారాల పంపిణీ
ఖాజీపేట మేజర్ న్యూస్: సేవాభావం చిన్నతనం నుంచే అలవడాలని నిరూపిస్తూ ఇద్దరు చిన్నారులు పేద విద్యార్థులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఖాజీపేట మండలంలోని టీచర్స్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (ఎంపీపీఎస్) షేక్ అయిషా హుమేరా, షేక్ ముహమ్మద్ హుస్సేన్ విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు, మూంగ్‌దాల్ ప్యాకెట్లు, అరటిపండ్లు అందజేశారు. తోటి విద్యార్థుల పట్ల చూపిన ఆప్యాయత, సేవా గుణం పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఎన్. సుమన్ చిన్నారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంఘం అధ్యక్షుడు షేక్ హాజీ గౌస్ పాల్గొన్నారు.
శివరామిరెడ్డి సూర్య రిపోర్టర్ ఖాజీపేట