మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించిన నంద్యాల జిల్లా పోలీసులు-ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్
సూర్య, నంద్యాల బ్యూరో:
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ గారి చిత్రపటానికి జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ 1888 నవంబర్ 11న జన్మించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, రచయిత, పాత్రికేయుడని కొనియాడారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని, దేశ ఐక్యత, సమగ్రత, మత సామరస్యం కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించి, విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధి, సాంకేతిక విద్యా విస్తరణకు పునాదులు వేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.నేడు ఆయన జన్మదినంను దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆయన విద్యారంగానికి అందించిన సేవలకు నిదర్శనమని తెలిపారు. 1992లో మరణానంతరం భారతరత్న పురస్కారంతో గౌరవించబడ్డారని, ఆయన దేశభక్తి, విద్యా దృక్పథం, జాతీయ సమైక్యతా భావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ S.ఖాదర్ భాషా గారు, AR అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ గారు,RI సురేష్ గారు,పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయక్ గారు, RSI హర్షవర్ధన్ రెడ్డి గారు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*