వ్యవసాయ క్షేత్రంలో లభించిన జింకపిల్లను అటవీ అధికారులకు అప్పగింత
సూర్య బోధన్:నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో లభించిన జింకపిల్లను బీఆర్ఎస్ నాయకుడు తేళ్ల రవికుమార్ అటవీ అధికారులకు, కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా జింకపిల్లను సురక్షితంగా అధికారులకు అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తేళ్ల రవి అన్న యువసేన సభ్యులు కమ్మరి మంజునాథ్, రుద్రంగి సందీప్, శివ, రఘువీర్, చిత్తరి సంజు, వడ్ల ఉమాకాంత్, గాండ్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.