విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ
సూర్య మాక్లూర్ : మండలం చిక్లీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రామ ఉపసర్పంచ్ బురోళ్ల సతీష్ తన సొంత ఖర్చుతో రూ.15 వేల విలువైన స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమయ్య, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ అశోక్, పాఠశాల హెడ్‌మాస్టర్ రత్నాకర్, షబ్బీర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భూమయ్య, నరేష్, గ్రామ కార్యదర్శి నవీన్ కుమార్, కరోబారి సాయిలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.