ఇంద్రకీలాద్రి అమ్మవారి అన్నదానం పథకానికి లక్ష రూపాయలకు పైగా విరాళం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదానం పథకానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు. ఇందులో భాగంగా విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బూరగడ్డ అనిత, కే. లక్ష్మణరావు తరఫున తమ కుటుంబ సభ్యులతో కలిసి రూ.1,00,016 (ఒక లక్ష పదహారు రూపాయలు) విరాళాన్ని అందజేశారు.
ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీ వి.కె. శీనా నాయక్‌కు అందజేశారు. భక్తులకు నిత్యం అన్నప్రసాదం అందించే పవిత్రమైన అన్నదానం పథకానికి తమ వంతు సహకారం అందించడం పట్ల దాతలను ఈఓ అభినందించారు.
ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు. భక్తుల సహకారంతో అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతున్నాయని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.