ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులో నూతన పార్కు ప్రారంభం
పటాన్‌చెరు:పట్టణంలో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించేందుకు పార్కులు ఎంతో దోహదపడతాయని ఇస్నాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ అన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును ముఖ్య అతిథి గూడెం మధుసూదన్ రెడ్డితో కలిసి చైర్ పర్సన్ ప్రారంభించారు.పార్కులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,పరిశుభ్రతను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజనేయులు,కిషోర్ రెడ్డి,రాహుల్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం,కాలనీవాసులు పాల్గొన్నారు.