ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలి, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి,- ఏవో అనిల్
లింగాల:
యాసంగి 2026-27 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గి, భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం ఉన్నందున, నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అనిల్ రైతులకు సూచించారు. పంట మార్పిడి విధానం ఆవశ్యకతపై ఆయన మాట్లాడుతూ రైతులందరూ వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ యాసంగి సీజన్‌లో వరి పంట సాగును చేపట్టకుండా, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
శనగ, జొన్న,కుసుమ, నువ్వులు,కూరగాయలు, నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి అనువైన ఇతర ఆరుతడి పంటలు.తగినంత బోరు బావులు లేదా నమ్మకమైన నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు మరియు ఉద్యాన పంటలు యాసంగిలో సాగు చేసుకోవడానికి ప్రత్యామ్నాయ పంటలనీ సూచించారు.
రైతులు యాసంగి 2026లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలన్నారు.
భూగర్భ జలాల పరిరక్షణకు సహకరించాలన్నారు.
ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రతి రైతు తాను సాగు చేయదలచిన ప్రత్యామ్నాయ పంట వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికు తెలుపాలన్నారు.పంటల మార్పిడి వివరాలను వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులోకి వచ్చే ప్రత్యేక యాప్‌లో నమోదు చేయడం జరుగుతుందనీ వివరించారు. మండలంలోని రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించి, ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టి నీటి వనరులను కాపాడుకోవాలని కోరారు.