క్రీడలతో మానసిక ఉల్లాసం
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు మెసానికల్ మైదానంలో వన్ డే సెవన్స్ ఫుట్ బాల్ నాకౌట్ టోర్నమెంట్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కరప్షన్ బ్యూరో ఆఫ్ పీపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో శారీరిక దారుఢ్యం తో పాటు మానసిక ఒత్తిడిలు దూరము కావాడమే కాక మంచి క్రమశిక్షణ ఉన్నత లక్షణాలు అలవడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అండ్ నేషనల్ , వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చిట్టి బాబు, చిత్తూరు మేయర్ కటారి హేమలత కోచ్ లు ఉదయ్ కుమార్ స్థానిక కార్పొరేటర్ అనసూయ, బిజెపి నాయకులు చిట్టిబాబు ఓటమి నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.