రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు తప్పవ్
గుర్ల మేజర్ న్యూస్: రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు కెల్ల జంక్షన్ సమీపంలో విజయనగరం పాలకొండ రహదారి గోతులమయం కావడంతో రోడ్డు పూర్తిగా శిథిలమయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే రహదారిలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందని వాహన చోదకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని మండల ప్రజలు కోరుతున్నారు
రిపోర్టర్ టి రాము నాయుడు , గుర్ల, విజయనగరాం