BREAKING
ఆరోగ్యమే మహాభాగ్యం : KLR నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో... జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ కుందుర్పి సర్పంచ్ అభ్యర్థి గా పెద్ద నరసింహప్ప 29,31 వ వార్డుల్లో తాగునీటి పరిష్కారం చేసిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ శ్రేణులు నూతన రైస్ మిల్ ప్రారంభం భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు : పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ క్రీడలతో మానసిక ఉల్లాసం రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు తప్పవ్ హెట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు...

గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.

Select Suryaa Now
గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి  : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.

బాపట్ల,మేజర్‌న్యూస్‌:

 భగవాన్ బిర్సా ముండా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని గిరిజనులు విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి రంగాల్లో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి.,పేర్కొన్నారు.గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము వారి ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం  ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హల్  నందు  గిరిజన స్వాతంత్ర్య పోరాట నాయకులు “శ్రీ భగవాన్ బిర్సాముండా 151వ జయంతి – జాన్ జాతీయ గౌరవ దినోత్సవ వేడుకల లో  భాగంగా గిరిజన స్వాతంత్ర్య పోరాట నాయకుల బిర్సా  ముండ చిత్ర పటానికి పూలమాలలు వేసి  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,నివాళులర్పించారుజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  భగవాన్ బిర్సా ముండా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని గిరిజనులు విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి రంగాల్లో ముందుకు సాగాలని, విద్య ద్వారానే వ్యక్తి, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొంటూ, గిరిజన ప్రాంతాల్లో పిల్లలు చదువుకునేలా సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు.విద్య ద్వారానే సమాజంలో సమాన అవకాశాలు, గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతాయి. గిరిజనుల విద్య, అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని,మూఢనమ్మకాలను విడనాడి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బిర్సా ముండా గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని, ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో గిరిజన వీరుడు, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా చేసిన సేవలు చిరస్మరణీయంని తెలిపారు. బిర్సా ముండా తన చిన్న వయస్సులోనే గిరిజనుల హక్కులు, భూమి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, గిరిజన సమాజాన్ని చైతన్యపరిచి, వారిలో ఐక్యతా భావాన్ని పెంపొందించి ఉల్గులాన్ అనే మహా ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. కేవలం 25 సంవత్సరాల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఆయన పోరాట స్ఫూర్తి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, కళలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవడంతో పాటు ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి సాధించాలి. భగవాన్ బిర్సా ముండా చూపిన ధైర్యం, పోరాట పటిమ, సామాజిక చైతన్యం, ఆత్మగౌరవం మనందరికీ ఆదర్శం కావాలి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఐక్యతతో ముందుకు సాగుతూ అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా యంత్రాంగం తరఫున గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాఉన్నామని తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు గురుకుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టరేట్‌లో ప్రారంభించిన గ్రంథాలయానికి పుస్తకాలు అందించి, వాటిని విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఎన్‌జీఓ భగవాన్ దాసు, తిరువీధుల శంకర్ ప్రసాద్, దేవరకొండ రాము బిర్సా ముండా సేవలు, ప్రాముఖ్యతను వివరించారు. గిరిజన ప్రజలకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం, సంక్షేమ సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి దాసరి అమర సుబ్బయ్య, సర్వ శిక్ష అభియాన్ పి ఓ.శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్,డి యం & హెచ్ ఓ.డాక్టర్ ఎస్. విజయమ్మ, డి సి హెచ్ ఎస్.డాక్టర్ పద్మావతి, స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డుల  జిల్లా మేనేజర్ రాజేష్, జిల్లా ఆడిట్ అధికారిణి రాజ్యం, గిరిజన సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు,  గిరిజన గురుకుల పాఠశాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.