గ్రామీణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు గుడితండా, హనుమాన్ నగర్‌లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు
సంగారెడ్డి ; గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ, హైదరాబాద్), ఐఈఈఈ సైట్ హైదరాబాద్ సెక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించారు.'విలేజ్ 360°' కార్యక్రమంలో భాగంగా నవంబర్ 14న గుడితండాలో, నవంబర్ 15న హనుమాన్ నగర్‌లో 'స్మార్ట్ హెల్త్‌కేర్ అండ్ కమ్యూనిటీ వెల్‌నెస్' పేరుతో ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచులు నేనావత్ లుక్య నాయక్, కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరాలకు గ్రామీణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.యశోద హాస్పిటల్స్‌కు చెందిన నిపుణులైన వైద్య బృందం గ్రామస్తులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు.
శిబిరంలో అందించిన వైద్య సేవలు:
రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర (షుగర్) పరీక్షలు,, సాధారణ ఆరోగ్య పరీక్షలు,గుండె సంబంధిత పరీక్షలు,కార్డియాలజిస్ట్ వైద్యుల సంప్రదింపులు,ఉచిత ఈసీజీ పరీక్షలు,జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలు
కంటి పరీక్షలు,దంత వైద్య పరీక్షల ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టెక్నాలజీ వినియోగం, ఆధునిక వైద్య విధానాలు, గుండె సంబంధిత వ్యాధులు, వాటి నివారణ చర్యలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గుండె జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం యొక్క ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వైద్య రంగంలో అందుబాటులోకి వస్తున్న సేవలను కూడా వివరించారు.ఈ కార్యక్రమంలో ఐఈఈఈ సైట్ హైదరాబాద్ సెక్షన్ చైర్ ప్రొఫెసర్ ఉమా ఎన్. దుల్హారే, కోఆర్డినేటర్ డాక్టర్ వి. ధర్మ సింగ్, యశోద హాస్పిటల్స్ పీఆర్వో ఎన్. గణేష్ పాల్గొన్నారు.గ్రామీణ ప్రజలు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండానే నిపుణులైన వైద్యులను సంప్రదించి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఈ శిబిరాల ద్వారా కల్పించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు యశోద హాస్పిటల్స్, ఐఈఈఈ సైట్ హైదరాబాద్ సెక్షన్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.