BREAKING
కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం. ఘనంగా వ్యాపారవేత్త బోడపాటి లోకనాథం నాయుడు జన్మదిన వేడుకలు రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చీపురుపల్లి రెడ్ క్రాస్ ను సందర్శించిన రాష్ట్ర చైర్మన్ రామారావు చారిత్రక గుర్తింపు కలిగిన కమాన్‌ను తొలగించడం బాధాకరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్. సినీ హీరో సుమన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను గ్రామీణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు గుడితండా, హనుమాన్ నగర్‌లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక

చారిత్రక గుర్తింపు కలిగిన కమాన్‌ను తొలగించడం బాధాకరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్.

Select Suryaa Now
చారిత్రక గుర్తింపు కలిగిన కమాన్‌ను తొలగించడం బాధాకరం  ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్.

 

సూర్య - పెద్దపల్లి:
పెద్దపల్లి పట్టణానికి దశాబ్దాలుగా చారిత్రక గుర్తింపుగా, ఐకానిక్ కట్టడంగా నిలిచిన ప్రధాన కమాన్‌ను తొలగించడం బాధాకరమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం కమాన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధిలో భాగంగా నూతన కమాన్ నిర్మాణం చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, స్థానికుల భావోద్వేగాలతో ముడిపడిన చారిత్రక కమాన్‌ను కూల్చివేయడం సమంజసం కాదన్నారు. నూతనంగా నిర్మించనున్న కమాన్ నమూనా చిత్రపటాన్ని (డిజైన్ బ్లూప్రింట్) వెంటనే అధికారికంగా విడుదల చేసి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పట్టణ సాంస్కృతిక, చారిత్రక ఆనవాళ్లు ప్రతిబింబించేలా ఆధునిక హంగులతో ఆకర్షణీయంగా నూతన కమాన్‌ను నిర్మించాలని కోరారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చారిత్రక కట్టడాల చట్టం-1958 ప్రకారం 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా జిల్లా కలెక్టర్, పురపాలక సంఘం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కమాన్ పరిసరాల్లో విశాలమైన సర్కిల్ ఏర్పాటు చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని, స్థానిక అధికార యంత్రాంగాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కుక్క అశోక్, నూనె వెంకటేష్, ఎం.డి. మెహరాజ్, షఫీ, చరణ్, ప్రేమ్, శ్రావణ్, తిరుమల్, రమేష్, అభినవ్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.