BREAKING
కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం. ఘనంగా వ్యాపారవేత్త బోడపాటి లోకనాథం నాయుడు జన్మదిన వేడుకలు రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చీపురుపల్లి రెడ్ క్రాస్ ను సందర్శించిన రాష్ట్ర చైర్మన్ రామారావు చారిత్రక గుర్తింపు కలిగిన కమాన్‌ను తొలగించడం బాధాకరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్. సినీ హీరో సుమన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను గ్రామీణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు గుడితండా, హనుమాన్ నగర్‌లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక

మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

Select Suryaa Now
మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

మెదక్, ప్రతినిధి : సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల నూతన పింఛన్లు మంజూరు చేయగా, మెదక్ జిల్లాలోనే 11 వేల మందికి పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు.ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లో మొత్తం 1,386 మందికి రూ.31,84,176 వ్యయంతో పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందులో వితంతువులు 965 మంది, ఒంటరి మహిళలు 166 మంది, దివ్యాంగులు 195 మంది, గీత కార్మికులు 60 మంది ఉన్నారని వివరించారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ఈ పింఛన్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు భరోసా కల్పిస్తాయని అన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక ప్రోత్సాహం..

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయాలతో పాటు మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు.

ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,800 ఇందిరమ్మ ఇళ్లు..

రాష్ట్రంలో గుడిసెలు లేని సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,800 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు 1,400 ఇళ్లు కేటాయించగా, ఇప్పటివరకు 400 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.

వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి..

టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, ఆందోల్, బొడ్మట్‌పల్లి వంటి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. స్థానిక యువతలో ఉన్న నైపుణ్యాలను వినియోగించుకునేలా పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, మెదక్ ఇన్‌చార్జి ఆర్డీఓ రామకృష్ణ, టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండలాల ఎంపీడీఓలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.