ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం
సూర్య ఉట్నూర్ : ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాలెగూడ (ఉమ్రి) గ్రామానికి చెందిన కోలాం సంఘం సీనియర్ నాయకుడు టేకం భీంరావును జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ మంద మకరందు, ఏ పీ ఓ వసంత్ రావు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి, హక్కుల పరిరక్షణకు, సామాజిక చైతన్యానికి టేకం భీంరావు చేసిన సేవలను ఈ సందర్భంగా అధికారులు అభినందించారు. కోలాం ఆదివాసీ సంక్షేమం, అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.ఆదివాసీ గిరిజన సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకులను గుర్తించి గౌరవించడం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.