చీపురుపల్లి రెడ్ క్రాస్ ను సందర్శించిన రాష్ట్ర చైర్మన్ రామారావు
చీపురుపల్లి మేజర్ న్యూస్: చీపురుపల్లి రెడ్ క్రాస్ కార్యాలయాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వై డి రామారావు ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. చీపురుపల్లి రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రం నడుస్తున్న తీరును సమీక్షించి, సభ్యులందరూ ఏకతాటిపై నడవడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ ద్వారా పలు సేవలు విస్తృతం చేయాలని సూచించారు. చీపురుపల్లి రెడ్ క్రాస్ సభ్యులు డాక్టర్ పల్లా వెంకయ్య, కమిటీ జనరల్ సెక్రటరీ గుడివాడ నారాయణరావు, ట్రెజరర్ పనస రవి, జాయింట్ సెక్రెటరీ డి ఆర్ ప్రసాద్ రావు, శాశ్వత సభ్యులు పతివాడ రమేష్, సుంకరి మణికంఠ లు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి, ఘన సన్మానం చేశారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా