మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-కృష్ణా జిల్లా, మోపిదేవి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆదివారం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తనయులు, యువ నాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా