BREAKING
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా చిత్తూరు మెకానిక్ మైదానంలో ఫుట్‌బాల్ టోర్నీ—ఎ మ్మెల్యే గురజాల చేతుల మీదుగా ఘన ప్రారంభం తుమ్మపాల సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తనయుడు నితీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ పి.ఎస్. చందు. అందరి చూపు లేపాక్షి నాలుగవ ఎంపీటీసీ శివ శంకర పైనే… సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అతనికే మద్దుత..… మండలంలో అత్యధిక మెజారిటీ అతనిదే.… గ్రంథాలయ వారోత్సవాల్లో ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన : గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించిన వక్తలు : హాజరైన వెంకటేశ్వర రెడ్డి,జల్లా లలితమ్మ,నరసింహారెడ్డి కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం. ఘనంగా వ్యాపారవేత్త బోడపాటి లోకనాథం నాయుడు జన్మదిన వేడుకలు రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చీపురుపల్లి రెడ్ క్రాస్ ను సందర్శించిన రాష్ట్ర చైర్మన్ రామారావు చారిత్రక గుర్తింపు కలిగిన కమాన్‌ను తొలగించడం బాధాకరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్. సినీ హీరో సుమన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్

కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం.

Select Suryaa Now
కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం.

**కళ్యాణదుర్గం:** వివిధ నేరాలకు సంబంధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నాలుగు వాహనాలకు ఈ నెల 18వ తేదీ బుధవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కళ్యాణదుర్గం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి పర్యవేక్షణలో కళ్యాణదుర్గం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఈ వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణదుర్గం ఎక్సైజ్ స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. వేలంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని, జీఎస్టీకి సంబంధించిన వివరాలు కూడా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు ముందుగా రూ.3,000 డిపాజిట్ మొత్తాన్ని చెల్లించి ఎంట్రీ పాస్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. నిర్ణీత డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వేలంలో వాహనాన్ని దక్కించుకున్న వ్యక్తి అదే రోజు వాహనానికి సంబంధించిన పూర్తి వేలం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా నిర్ణయించిన మొత్తం విలువపై అదనంగా 18 శాతం జీఎస్టీని కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తం చెల్లింపులు పూర్తయిన అనంతరం సంబంధిత వాహనాలను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించనున్న నేపథ్యంలో ఆసక్తి గల వ్యక్తులు అవసరమైన ధ్రువపత్రాలతో సమయానికి హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు. వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కళ్యాణదుర్గం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.