BREAKING
ఎన్ఎంఎంఎస్ నమూనా ప్రవేశ పరీక్ష 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పెద్దాపూర్ గుట్టపై ప్రోక్లెయినర్‌ విధ్వంసం! - అధికారుల పర్యవేక్షణ ఏదీ? రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా చిత్తూరు మెకానిక్ మైదానంలో ఫుట్‌బాల్ టోర్నీ—ఎ మ్మెల్యే గురజాల చేతుల మీదుగా ఘన ప్రారంభం తుమ్మపాల సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తనయుడు నితీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ పి.ఎస్. చందు. అందరి చూపు లేపాక్షి నాలుగవ ఎంపీటీసీ శివ శంకర పైనే… సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అతనికే మద్దుత..… మండలంలో అత్యధిక మెజారిటీ అతనిదే.… గ్రంథాలయ వారోత్సవాల్లో ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన : గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించిన వక్తలు : హాజరైన వెంకటేశ్వర రెడ్డి,జల్లా లలితమ్మ,నరసింహారెడ్డి కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం. ఘనంగా వ్యాపారవేత్త బోడపాటి లోకనాథం నాయుడు జన్మదిన వేడుకలు రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి

గ్రంథాలయ వారోత్సవాల్లో ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన : గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించిన వక్తలు : హాజరైన వెంకటేశ్వర రెడ్డి,జల్లా లలితమ్మ,నరసింహారెడ్డి

Select Suryaa Now
గ్రంథాలయ వారోత్సవాల్లో ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన : గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించిన వక్తలు : హాజరైన వెంకటేశ్వర రెడ్డి,జల్లా లలితమ్మ,నరసింహారెడ్డి

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం ప్రధాన శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా రెండవ రోజైన ఆదివారం పుస్తక ప్రదర్శన,ప్రముఖ సాహితీవేత్తల పరిచయాల ప్రసంగాలు జరిగాయి.సామాజిక ఉపయుక్తమైన,విద్యార్థులకు అతి ముఖ్యమైన పోటీ పరీక్షలకు సంబంధించి దాదాపు 300 పుస్తకాలు ప్రదర్శనలో ఉంచబడ్డాయి.సదరు పుస్తకాల గురించి విశ్లేషిస్తూ విద్యార్థిని విద్యార్థులకు గ్రంథ పరిచయం చేశారు.ముందుగా విశిష్ట అతిథిగా విచ్చేసిన వెంకటేశ్వర రెడ్డి ఒక విద్యుత్ ప్రమాదంలో శరీరమంతా కాలిపోయి రెండుచేతులు కోల్పోయి ప్రమాదం జరిగిన తర్వాత సంవత్సరంపాటు ఆసుపత్రులలో గడిపి ప్రాణాలతో బయటపడ్డ తాను నిరాశ చెందకుండా ఒక్కో అడుగే వేసుకుంటూ ట్రాక్టర్ నడపడం,సుమో నడపడం స్థాయికి ఎదగడం,వ్యవసాయం చేస్తూ ఆదర్శ రైతుగా ఎదిగి అందరి వద్ద ప్రశంసలు పొందడం,రాజకీయాలలో సైతం పాలుపంచుకొనడం తదితర విషయాలను విద్యార్థులకు వివరించారు.నిరాశ అనేది మృత్యువుకు చేరవు చేస్తుందని,ఆశ అనేది ముందుకు తీసుకెళ్లి ఉన్నత పథంలో నిలుపుతుందని తెలిపారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ గ్రంథాలయం యొక్క ఉపయోగాలు,గ్రంథాలయం ద్వారా విద్యార్థులు ఉన్నత 
స్థితికి ఎలా చేరుకోవచ్చుననే అంశాలను అద్భుతంగా వివరించారు.విద్యార్థులు గ్రంథాలయ పఠనాన్ని అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అదేవిధంగా మోటివేటర్ రామ్మూర్తి పిల్లలు గ్రంథాలయం ఉపయోగించుకుని చదువుకు అనుసంధానం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థితికి ఎలా చేరుకోవాలో తెలియజేశారు.మరో అతిథి నరసింహారెడ్డి గ్రంథాలయ విశిష్టత,తల్లిదండ్రుల కష్టాలను విద్యార్థులు ఎలా ఆకలింపు చేసుకోవాలో వారి కష్టాలకు ప్రతిఫలంగా తమ చదువులతో ఎలా ఉన్నతికి చేరుకోవాలో తమ గానం,పాటల ద్వారా సందేశాత్మకంగా వివరించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయిని సురభి హేమలత,టిఎస్ఏ కృష్ణమూర్తి,గొల్లపూడి తిరుపతిరావు,బండి రెడ్డెప్ప,టీచర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధికారిణి వసంత కుమారి అధ్యక్షత వహించగా సిబ్బంది జయమ్మ,పాఠకులు,జ్ఞానోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి