అందరి చూపు లేపాక్షి నాలుగవ ఎంపీటీసీ శివ శంకర పైనే… సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అతనికే మద్దుత..… మండలంలో అత్యధిక మెజారిటీ అతనిదే.…
లేపాక్షి మేజర్ న్యూస్ : మండల కేంద్రమైన లేపాక్షి లోని ఎంపీటీసీ నాలుగో స్థానం గలిబిపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 1354 ఓట్లు పోలవ్వగా అందులో 648 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఈ విషయమై గ్రామస్తులతో పాటు మండలంలోని నాయకులు, కార్యకర్తలు అతడిని అందరూ అభినందించారు. దీంతోపాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శిలుకూడా అభినందించడం జరిగింది. స్థానికంగా నాయకులతో పాటు ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఎంతో మంది ప్రజల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం దిశగా అధికారులకు ప్రజలకు వారిదిగా ఉంటూ సమస్యలను పరిష్కారం చేసిన గత ఘనత అతనిది . ఇదంతా ఓక ఎత్తు అయితే సీనియర్ నాయకుల నుండి జూనియర్ నాయకుల వరకు అందరూ గలిబిపల్లి శివశంకర కె మద్దుత పలుకుతూ వైస్ ఎంపీపీ పదవి ఇలాంటి వ్యక్తికి ఇవ్వాలని మద్దతు తెలుపుతున్నారు . ఇలాంటి వ్యక్తికి వైస్ ఎంపీపీ పదివిఇస్తే పార్టీతో పాటు ప్రజల సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్తాడని నాయకులు ఆకాంక్షిస్తున్నారు.
పద్మభూషణ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీర్వాదం ఇస్తే వైస్ ఎంపీపీ ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం...…
నాయకులతో, ప్రజలతో సమన్వయంతో ఉంటూ పార్టీ అభివృద్ధి కి తోడ్పడి, ప్రజలకు సేవ చేసే అవకాశం టిడిపి లోని యువ నాయకులకు కల్పించాల్సిన అవసరం అధిష్టానం పై ఎంతైనా ఉంది.