22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు
సూర్య - పెద్దపల్లి:
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్న స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని స్వర్ణోత్సవ కమిటీ ఛైర్మన్,సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య పిలుపునిచ్చారు.ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఈ చారిత్రాత్మక వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని,జిల్లాలోని అన్ని మండలాలు,మున్సిపాలిటీలు,కార్పొరేషన్ పరిధిలోని సంఘం నాయకులు,సభ్యులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ మహాసభలకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి,అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి,సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ,మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్,మేడిపల్లి సత్యం,జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్,రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి,పెద్దపల్లి పురపాలక సంఘం ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య,ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణతో పాటు మాజీ శాసనసభ్యులు,వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న సుమారు వెయ్యి మంది నాయకులు,కార్యకర్తలకు ప్రత్యేక జ్ఞాపికలు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో స్వర్ణోత్సవ కమిటీ కన్వీనర్ మైస రాజేష్,వైస్ ఛైర్మన్ లంక సదయ్య,సమన్వయకర్త కుక్క అశోక్,కో-కన్వీనర్ పొనుగంటి రాజనర్సు,సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొంకూరి మధు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవ్వంపల్లి సతీష్,రాష్ట్ర కార్యదర్శి పాల రాజేశం,జిల్లా నాయకులు గుట్ట లింగయ్య,చొప్పదండి మల్లేశం, సంకెనపల్లి లక్ష్మయ్య,నక్క శంకరయ్య,బొల్లి నందయ్య,భూపెల్లి మల్లేశం,బాదె వెంకటేష్,బూడిద సమ్మయ్య,చుంచు మల్లేష్, కాసిపేట పోచయ్య,పెరక బానేష్,బోసెల్లి నారాయణ,కాంపల్లి నరసయ్య,గొట్టే రాజయ్య,కన్నూరి బాబు తదితరులు పాల్గొన్నారు.