BREAKING
ఇందిరాగాంధీ విగ్రహం పునః ప్రతిష్ట ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు , గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.మించల ప్రదీప్. గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు ఆటో - తుఫాను వాహనం ఢీ - ఒకరి మృతి భోగాపురం శ్రీ లెండిలో సందడి గిరిజనుల ఆత్మగౌరవ పోరాట యోధుడు బిర్సా ముండా ఘనంగా 151వ జయంతి వేడుకలు.. జనజాతీయ గౌరవ దివస్ నిర్వహణ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఎన్ఎంఎంఎస్ నమూనా ప్రవేశ పరీక్ష 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పెద్దాపూర్ గుట్టపై ప్రోక్లెయినర్‌ విధ్వంసం! - అధికారుల పర్యవేక్షణ ఏదీ? రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా చిత్తూరు మెకానిక్ మైదానంలో ఫుట్‌బాల్ టోర్నీ—ఎ మ్మెల్యే గురజాల చేతుల మీదుగా ఘన ప్రారంభం తుమ్మపాల సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్.

జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు

Select Suryaa Now
జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు

శ్రీకాళహస్తి సూర్యా న్యూస్ :జనసేన గర్జన మాధవ మహేష్ నామినేషన్.  శ్రీకాళహస్తి పట్టణం 21 వవార్డులో జనసేన అభ్యర్థిగా మాధవ మహేష్ నామినేషన్ దాఖలు. ప్రజా సేవే లక్ష్యంగా, స్థానిక సమస్యలు పరిష్కారమే ప్రధాన ఆశయం!
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో 21 వవార్డు జనసేన పార్టీ అభ్యర్థిగా పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్, స్థానిక సంస్థల ఎన్నికల సపోర్టింగ్ టీమ్ సభ్యులు, మాస్టర్ స్పోక్స్ పర్సన్ మాధవ మహేష్ ఈరోజు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు,     శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ పాల్గొని మాధవ మహేష్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగే ఎన్నికలు మాత్రమే కాదని, ప్రజల అవసరాలను గుర్తించి, వార్డు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేసే ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియ అని పేర్కొన్నారు.

21 వవార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే సంకల్పంతో మాధవ మహేష్  ఎన్నికల బరిలో నిలిచారని తెలిపారు.

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ప్రజాసేవా దృక్పథంతో స్థానిక సంస్థలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

పదవి అనేది బాధ్యత ప్రజాసేవ అనేది సంకల్పo అభివృద్ధి అనేది లక్ష్యం!
21 వవార్డు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ, ప్రజలతో మమేకమై పనిచేయాలనే లక్ష్యంతో మాధవ మహేష్ గారు తన నామినేషన్ దాఖలు చేయడం ఈ ఎన్నికల ప్రక్రియలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.