ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఏకైక కుమారుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత స్థానిక బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో తన తండ్రి గురుజాల జగన్మోహన్, తాతయ్య గురజాల చెన్నకేశవులునాయుడు, తల్లి గురజాల ప్రతిమ సమక్షంలో నితీష్ భారీ కేక్ కట్ చేసి హాజరైన టిడిపి శ్రేణులకు గురజాల అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం స్థానిక మెకానికల్ క్రీడా మైదానంలోనూ గురజాల నితీష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట చిత్తూరు నగరానికి చెందిన ప్రముఖ టిడిపి ముఖ్య నాయకులు చంద్రమౌళి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 13 వ డివిజన్ కార్పొరేటర్ జగ్గా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా గురజాల నితీష్ భారీ కేక్ కట్ చేసి నగరవాసులకు పంచిపెట్టడంతో పాటు, చంద్రమౌళి, జగ్గా సౌజన్యంతో 500 మందికి సరిపడా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి, జగ్గా మాట్లాడుతూ తమ అభిమాన ఎమ్మెల్యే ముద్దుల కుమారుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. నితీష్ ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆ సందర్భంగా ఆకాంక్షించారు. కాగా ఈ కార్యక్రమంలో నగర మేయర్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, గుడిపాల మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు, చిత్తూరు నగర టిడిపి ప్రధాన కార్యదర్శి పచ్చప్ప, చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళ మహిళ అధ్యక్షురాలు దామా లీలావతి, కూటమి నాయకులు ఉదయ్ కుమార్, నాగలక్ష్మి, ఫైరోజ్ ఖాన్, అక్తర్ భాష, జాఫర్ భాషా, కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉమాశంకర్ వస్తువులు స్టాఫ్ రిపోర్టర్.