BREAKING
ఘనంగా వ్యాపారవేత్త బోడపాటి లోకనాథం నాయుడు జన్మదిన వేడుకలు రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చీపురుపల్లి రెడ్ క్రాస్ ను సందర్శించిన రాష్ట్ర చైర్మన్ రామారావు చారిత్రక గుర్తింపు కలిగిన కమాన్‌ను తొలగించడం బాధాకరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్. సినీ హీరో సుమన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను గ్రామీణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు గుడితండా, హనుమాన్ నగర్‌లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

Select Suryaa Now
పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం  గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

సూళ్లూరుపేట మేజర్ న్యూస్

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని సూళ్లూరుపేట శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు.గ్రంథాలయ అధికారి ఎన్ శ్రీనివాసులు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి మన్నారుపోలు గ్రామంలోని ఆర్ఎంకె ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల పుస్తకాల ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. విజ్ఞాన, సాహిత్య,చారిత్రక అంశాలకు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ఆర్ లీలాకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా గ్రంథాలయాల్లో లభించే వివిధ విజ్ఞానదాయక పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించుకోవాలన్నారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.గ్రంథాలయ అధికారి ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల మేధో వికాసంతో పాటు సృజనాత్మకత,ఆలోచనా శక్తి పెరుగుతాయన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడమే ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు, స్థానిక పాఠకులు పాల్గొని పుస్తక ప్రదర్శనను విజయవంతం చేశారు.