BREAKING
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ హ్యాండ్ బాల్ విజేతగా ఎస్వీయూ కళాశాల నిబంధనలు గాలికి.. జనావాసాల మధ్యే వైన్‌షాప్‌! సిగ్నల్‌ లేక.. సేవలు సాగక! విద్యార్థుల స్కాలర్షిప్ సంగతేంటి...సారూ...! -ఫీజులతో సంబంధం లేకుండా సర్టీఫికేట్లు ఇవ్వాల్సిందే.. స్పందన బాధిత కుటుంబానికి అందిన రేషన్‌! పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి... ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ శ్రేణులకు ఆహ్వానం రట్టిణిలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందడి *నిర్వాసితుల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా? బోయిన రమేష్ దంపతులకు ప్రజల బ్రహ్మరథం అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..

నామినేషన్ కేంద్రాల పై డ్రోన్ నిఘా

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాల పై డ్రోన్ నిఘా

 

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్సై అమీర్ అలీ

మెలియాపుట్టి. నవంబర్ 18. మేజర్ న్యూస్... గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా మండలంలోని పలు నామినేషన్ కేంద్రాల పరిసరాలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం మెలియాపుట్టి ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ స్వయంగా డ్రోన్ కెమెరా ద్వారా కేంద్రాల పరిసరాలను పరిశీలిస్తూ భద్రతా చర్యలను పర్యవేక్షించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడే వారిపై నిఘా ఉంచడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తోపాటు 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నాయని తెలిపారు. నిబంధనల ప్రకారం కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు అనుమతించిన ముగ్గురికి మాత్రమే కేంద్రంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ కోరారు.