BREAKING
పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం.. నామినేషన్ కేంద్రాల పై డ్రోన్ నిఘా విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణి విద్యుత్ సేవా లోపాలను తక్షణమే పరిష్కరించాలి 208 మంది విద్యార్థులకు కంటిపరీక్షలు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం అక్వాన్’ తుఫాను.. యంత్రాంగం అప్రమత్తం! బ్రిటన్ రక్షణ దిగ్గజం బీఏఈ సిస్టమ్స్ లో 1,070 ఉద్యోగాల కోత.. ఆ విభాగాలపైనే ప్రధాన ప్రభావం! పేద విద్యార్థిని చదువుకు అండగా మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ -టిటిడి విద్యాసంస్థల నిర్వహణపై ప్రశంసలు గుంటూరు నగరంలో వ్యక్తి అదృశ్యం

పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

Select Suryaa Now
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఐపీఎస్ పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ…ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా ఉంచాలని, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నమోదైన కేసుల్లో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరితగతిన గుర్తించి కేసులను ఛేదించాలని స్పష్టం చేశారు.అలాగే సీసీటీఎన్ఎస్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ పోలీస్ వ్యవస్థలకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ విధుల పట్ల బాధ్యత, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సమగ్రంగా పరిశీలించి చట్టపరిధిలో సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కొండల్ రెడ్డి, ఎస్‌ఐ మోహన కృష్ణతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.