BREAKING
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ హ్యాండ్ బాల్ విజేతగా ఎస్వీయూ కళాశాల నిబంధనలు గాలికి.. జనావాసాల మధ్యే వైన్‌షాప్‌! సిగ్నల్‌ లేక.. సేవలు సాగక! విద్యార్థుల స్కాలర్షిప్ సంగతేంటి...సారూ...! -ఫీజులతో సంబంధం లేకుండా సర్టీఫికేట్లు ఇవ్వాల్సిందే.. స్పందన బాధిత కుటుంబానికి అందిన రేషన్‌! పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి... ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ శ్రేణులకు ఆహ్వానం రట్టిణిలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందడి *నిర్వాసితుల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా? బోయిన రమేష్ దంపతులకు ప్రజల బ్రహ్మరథం అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..

విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణి

Select Suryaa Now
విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణి


సంతబొమ్మాళి, నవంబర్ 18,మేజర్ న్యూస్ :
యమల పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని దుక్క తలస రెడ్డి  తెలుగు, ఆంగ్లం సబ్జెక్టులకు సంబంధించిన ప్రత్యేక మెటీరియల్ పుస్తకాలను అందజేశారు. స్టడీ మెటీరియల్ పుస్తకాలను దుక్క తులసి రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు మీసాల శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందజేయడం అభినందనీయమని అన్నారు. గతంలో కూడా పాఠశాల కార్యాలయానికి అవసరమైన సామగ్రిని అందించి సహకరించారని గుర్తుచేశారు.
విద్యార్థుల చదువుకు తోడ్పాటునందిస్తూ, పాఠశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న దుక్క తలస రెడ్డి కి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్య కమిటీ చైర్మన్   సాహుకారి  గోవిందరావు, వ్యాయామ ఉపాధ్యాయులు నడిమింటి నాగరాజు, సత్యవతి, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.