BREAKING
పేద విద్యార్థిని చదువుకు అండగా మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ -టిటిడి విద్యాసంస్థల నిర్వహణపై ప్రశంసలు గుంటూరు నగరంలో వ్యక్తి అదృశ్యం ఆసియా ర్యాంకింగ్స్ లో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఇంటెల్ లో మరోసారి ఉద్యోగాల కోత.. ఎవరిపై ప్రభావం పడుతోంది? ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీ అందుతుందా? పూర్తి వివరాలు ఇవే! ఎస్పీడబ్ల్యూలో రక్తదాన శిభిరం పుణెలో గూగుల్ ఇంజనీర్ నెలవారీ ఖర్చు రూ.40,000 లోపే.. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పొదుపు మంత్రం! ఉత్తమ పౌరులుగా ఎదగాలి -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ 28న పాఠశాల స్థాయి కథల పోటీలు -డిసెంబర్ 6న విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా జిల్లా స్థాయి పోటీలు కథల పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన ప్రముఖులు 500 మిలియన్ డాలర్ల మైక్రోసాఫ్ట్ డీల్‌తో ఓపెన్‌ఏఐ నిషేధాన్ని అధిగమిస్తున్న బైట్‌డ్యాన్స్.. అమెరికా ఆంక్షలకు చెక్ పెడుతున్న చైనా టెక్ దిగ్గజం! ప్రమాణానికి ముందే ప్రజాసేవకు శ్రీకారం 54 డివిజన్ లో వీధి దీపాలు డ్రైనేజీ సమస్యల పరిష్కారం -ప్రజలలో వెలుగులు నింపిన నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం

గుంటూరు నగరంలో వ్యక్తి అదృశ్యం

Select Suryaa Now
గుంటూరు  నగరంలో వ్యక్తి అదృశ్యం

గుంటూరు : స్థానిక లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హుస్సేన్ నగర్ 4వ లైన్‌కు చెందిన షేక్ యూసఫ్ (38) గంటలమ్మ చెట్టు వద్ద బంగారు ఆభరణాల తయారీ వర్క్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తూ తన కుటుంబంతో కలిసి తన ఇంటి పైభాగంలో నివసిస్తుండగా తమ్ముడు షేక్ ఇబ్రహీం, ( 32)  ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ అదే ఇంటి కింది భాగంలో నివసించేవాడని తెలిపారు.
ఇబ్రహీం గతంలో అప్పులు చేయడం ఆర్థిక లావాదేవీల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో సుమారు మూడు నెలల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని  ఈ నేపథ్యంలో 16వ తేదీ రాత్రి సుమారు 09.00 గంటల సమయంలో ఇబ్రహీం స్నేహితులు యూసఫ్‌కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని అడగగా తనకు అతని అప్పుల వివరాలు తెలియవని తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. ఆగస్టు నెల చివరి నుంచి షేక్ ఇబ్రహీం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  లాలాపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ ఏవి శివప్రసాద్ తెలిపారు. అదృశ్యమైన షేక్ ఇబ్రహీం ఆచూకీ తెలిసిన వారు లేదా ఆయనను ఎక్కడైనా గుర్తించిన వారు సమీప లాలాపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించవలసిందిగా సీఐ తెలిపారు. తెలియజేయవలసిన ఫోన్ నెంబర్స్  0863-2221261,
ఎస్ హెచ్ ఓ 8688831311, 
ఎస్ ఐ : 8688831313 నంబర్లకు తెలియపరచాలని సీఐ శివప్రసాద్ పేర్కొన్నారు.

కే నాగరాజు గుంటూరు క్రైమ్