28న పాఠశాల స్థాయి కథల పోటీలు -డిసెంబర్ 6న విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా జిల్లా స్థాయి పోటీలు కథల పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన ప్రముఖులు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : విద్యార్థుల్లో పఠనాసక్తి, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కథల పోటీలు-2026కు సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం విశ్వం టాలెంట్ స్కూల్‌లో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్, విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, అప్పుస్మా నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర సమన్వయకర్త రామకృష్ణ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని పోటీల బ్రోచర్‌ను విడుదల చేశారు. కథలో పోటీలకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఈ పోటీలు ఈనెల 28 తేదీ ప్రతి పాఠశాలలో నిర్వహిస్తారు. ప్రతి పాఠశాల నుంచి ప్రతిభ కనబరిచిన ముగ్గురు విజేతులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. డిసెంబర్ 6వ తేదీ వరదరాజనగర్ లోని విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా కథల పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పాఠశాల స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, ఊహాశక్తి, ఆలోచనా విధానం, సామాజిక స్పృహ, నైతిక విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు హైమావతి, అబ్దుల్ రెహ్మాన్, సబిత, పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించి పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్