BREAKING
ఆసియా ర్యాంకింగ్స్ లో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఇంటెల్ లో మరోసారి ఉద్యోగాల కోత.. ఎవరిపై ప్రభావం పడుతోంది? ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీ అందుతుందా? పూర్తి వివరాలు ఇవే! ఎస్పీడబ్ల్యూలో రక్తదాన శిభిరం పుణెలో గూగుల్ ఇంజనీర్ నెలవారీ ఖర్చు రూ.40,000 లోపే.. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పొదుపు మంత్రం! ఉత్తమ పౌరులుగా ఎదగాలి -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ 28న పాఠశాల స్థాయి కథల పోటీలు -డిసెంబర్ 6న విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా జిల్లా స్థాయి పోటీలు కథల పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన ప్రముఖులు 500 మిలియన్ డాలర్ల మైక్రోసాఫ్ట్ డీల్‌తో ఓపెన్‌ఏఐ నిషేధాన్ని అధిగమిస్తున్న బైట్‌డ్యాన్స్.. అమెరికా ఆంక్షలకు చెక్ పెడుతున్న చైనా టెక్ దిగ్గజం! ప్రమాణానికి ముందే ప్రజాసేవకు శ్రీకారం 54 డివిజన్ లో వీధి దీపాలు డ్రైనేజీ సమస్యల పరిష్కారం -ప్రజలలో వెలుగులు నింపిన నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా

ఉత్తమ పౌరులుగా ఎదగాలి -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ

Select Suryaa Now
ఉత్తమ పౌరులుగా ఎదగాలి  -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్  -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థినులకు బుధవారం ఇండక్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థి వ్యవహారాల విభాగం, ప్రవేశాల సంచాలకుల కార్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థి వ్యవహారాల డీన్, ఆంగ్ల విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ ఎం. నీరజ సమన్వయకర్తగా వ్యవహరించారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోండి: వీసీ

ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ప్రొఫెసర్ వి.ఉమ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విశ్వవిద్యాలయం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ విద్యార్థి క్లబ్బులు, సహపాఠ్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, కేవలం విద్యాపరంగానే కాకుండా మంచి పౌరులుగా, సమర్థులైన వృత్తి నిపుణులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన జీవన నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు.

మంచి నడవడిక సంస్కారం అవసరం 

అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష, సైన్స్ డీన్ ప్రొఫెసర్ సుధ, హ్యుమానిటీస్ డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు, విద్యా వికాసం, వ్యక్తిత్వ వికాసం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఎం.నీరజ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సానుభూతి, పర్యావరణ స్పృహ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్ని బంగారు పతకాలు సాధించినా, మంచి నడవడిక, సంస్కారం, మానవీయ విలువలు లేనప్పుడు వాటికి నిజమైన విలువ ఉండదు అని స్పష్టం చేశారు. విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా సర్వతోముఖాభివృద్ధికి అవసరమని వివరించారు. అనంతరం అధ్యాపకులు, పరిపాలనా విభాగాల సమన్వయకర్తలు విశ్వవిద్యాలయంలోని వివిధ సదుపాయాలు, విద్యార్థుల కోసం అమలులో ఉన్న కార్యక్రమాలను విద్యార్థినులకు పరిచయం చేశారు.

రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణ

ఇండక్షన్ అనంతరం రెండు రోజుల పాటు జీవన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమర్థవంతమైన సంభాషణ, వ్యక్తుల మధ్య సంబంధాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమస్యల పరిష్కారం, సృజనాత్మక ఆలోచన, స్వీయ అవగాహన, భావోద్వేగాల నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్