BREAKING
ప్రోటోకాల్ విహదంతో నిలిచిన చేయూత పెన్షన్ల పంపిణీ గండి యాకయ్య చిత్రపటానికి నివాళులు పేదల సంక్షేమానికి పెద్ద పీట జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు...

ప్రోటోకాల్ విహదంతో నిలిచిన చేయూత పెన్షన్ల పంపిణీ

Select Suryaa Now
ప్రోటోకాల్ విహదంతో నిలిచిన చేయూత పెన్షన్ల పంపిణీ

*తరిగొప్పుల, మేజర్ న్యూస్, తరిగొప్పుల మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో చేర్యాల మార్కెట్ చైర్మన్ కొమ్మూరీ ప్రశాంత్ రెడ్డికి మైక్ ఇవ్వకపోవడంతో వివాదం ప్రారంభమైంది. దీంతో ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పించడం లేదంటూ కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా కార్యక్రమం కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.

**కొంతమందికే పత్రాల పంపిణీ**

వివాదం సద్దుమణిగిన అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే మంజూరు పత్రాలను అందజేసినట్లు సమాచారం. అయితే మిగిలిన లబ్ధిదారులకు పత్రాలు అందకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. ఉదయం నుంచే పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు నాయకుల మధ్య నెలకొన్న వివాదంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల్లో రాజకీయ విభేదాలు, ప్రోటోకాల్ వివాదాల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడటం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.

కాగా, అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ నాయక్, తహసీల్దార్ మోసిన్ ముస్తఫా, గ్రామ సర్పంచ్  అర్జుల జ్యోతి, కుర్ర మల్లయ్య తార అంజయ్య సుధాకర్ కొమురయ్య అల్పతి , దండం శ్రీను, భూక్య రవి, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు ఏడెల్లి శ్రీనివాస్ రెడ్డి లింగం    సతీష్ జైపాల్ సుధాకర్ రెడ్డి   మధుసూదన్ రెడ్డి   వివిధ గ్రామాల కాంగ్రెస్ మరియు తెరాస నాయకులు  పాల్గొన్నారు.