BREAKING
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు

ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు

Select Suryaa Now
ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు

మల్హర్ , మేజర్ న్యూస్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై మంథని నియోజకవర్గానికి చెందిన మాల సామాజిక వర్గ దళిత కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుధవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావు కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గాంధీభవన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. గత నెల 26న మల్హర్ రావు మండలం కొయ్యూరు, వల్లెంకుంట గ్రామాల్లోని పాఠశాలల్లో నిర్వహించిన విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును విమర్శించే బీఆర్ఎస్ నాయకులను వెంటబెట్టుకుని తిరుగుతూ, వారి ఇళ్లలో ఆతిథ్యం స్వీకరించారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సహకారం అందిస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేలా ఎంపీ వ్యవహరిస్తున్నారని నాయకులు ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తగిన ఆధారాలతో సమగ్ర విచారణ జరిపించి, ఏఐసీసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడిని కోరారు.ఫిర్యాదు చేసిన వారిలో ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం జిల్లా చైర్మన్ దండు రమేష్, కాటారం మాజీ ఎంపీపీ, జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల, మల్హర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ, యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మండల రాహుల్, చిన్నతూండ్ల సర్పంచ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాంతి రణదేవ్, మహదేవ్‌పూర్ మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ బందెల సత్తెమ్మ, తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, దామెరకుంట సర్పంచ్ కొడిపెల్లి రాము, ఎలికేశ్వరం సర్పంచ్ పల్లె రాజయ్య, మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం పోచయ్య, మహాముత్తారం మాజీ జెడ్పీటీసీ లింగమల్ల శారద, మహాముత్తారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగమల్ల దుర్గయ్య, పక్కల సడువలి, పోలారం మాజీ సర్పంచ్ వేల్పుల తిరుపతి, మల్హర్ మండల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేల్పుల రవి, వొడిపిలివంచ మాజీ సర్పంచ్ కోడి రవి, మాజీ సర్పంచ్ బుర్రి రాజేష్, మహదేవ్‌పూర్ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బుర్రి శివరాజ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు భూపెల్లి రాజు, కాటారం మాల మహానాడు మండల అధ్యక్షుడు నంది శశి, స్తంభంపల్లి పి.పి. మాజీ సర్పంచ్ మెరుగు పాపారావు, స్తంభంపల్లి పి.పి. మాల మహానాడు గ్రామ అధ్యక్షుడు జంగిడి కేశవస్వామి తదితరులు ఉన్నారు.

రిపోర్టర్; ప్రభాకర్ ,మలహర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా