ఎస్.రాయవరంలో నేడు విద్యుత్ అంతరాయం!
ఎస్.రాయవరం, నవంబర్ 17, మేజర్ న్యూస్:
మండలంలోని కొరుపోలు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో బుధవారం నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు ఏపీ ఈపీడీసీల్ అనకాపల్లి ఈఈ రామకృష్ణ తెలిపారు.
ఈ కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తిమ్మాపురం, కోనవానిపాలెం, సారిపల్లిపాలెం, కొరుపోలు, పెదగుమ్ములూరు, టీవీ రోడ్డు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. ప్రజలు, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.