పురుషులను మించి మహిళా ఓటర్లు!
ఎస్.రాయవరం లో పంచాయతీ తీర్పు మహిళలదే
ఎస్.రాయవరం, నవంబర్ 17, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మండల పరిధిలోని మొత్తం 290 వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 62,032 మంది.
వీరిలో:
* పురుష ఓటర్లు: 29,944 మంది • మహిళా ఓటర్లు: 32,086 మంది • ఇతరులు: 02 మంది
పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 2,142 మంది అధికంగా ఉండటం గమనార్హం. మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో ఈసారి ఎన్నికల ఫలితాల్లో మహిళల తీర్పు కీలకం కానుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.