ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం... ఈనెల 19న సిద్దిపేట్ సీఎం సభను విజయవంతం చేయాలి...
నర్సాపూర్ ; తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని సిద్దిపేట సభ వేదికగా మరో కీలక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టూనందుని కుటుంబంలో అనుకొని పరిస్థితిలో సభ్యులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా 5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు జిల్లా అధ్యక్షులు ఆంజనే యులు గౌడ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి వెల్లడించారు మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి సభలో ప్రజలకు వివరించనున్నారని తెలిపారు.
ఈ భారీ బహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19న సాయంత్రం 4 గంటలలోపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సిద్దిపేటకు చేరుకోవాలని సూచించారు.నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సిద్దిపేట సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపాల్ చైర్ పర్సన్ లక్ష్మి రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రాల మల్లేశం జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘమాల కార్యదర్శి స్వాతి ప్రవీణ్ నాయకులు శ్రీనివాస్ గుప్తా రామా గౌడ్ ఆంజనేయులు గౌడ్ రవిశంకర్ దావూద్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.