పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు!
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో సెమినార్,చర్చా కార్యక్రమం
- గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ అరసాడ రజనీకుమారి
- గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు
గరుగుబిల్లి, సూర్య: విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చని గరుగుబిల్లి శాఖ గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు పేర్కొన్నారు.గరుగుబిల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో గురుకుల పాఠశాల మరి యు కళాశాల గ్రంథాలయ అధికారి కోట మాధవి, గరుగుబిల్లి శాఖా గ్రంధా లయం నిర్వాహకులు నల్ల మధుసూద నరావు ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక సెమినార్ మరియు చర్చా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిం చారు.ఈసందర్భంగా శాఖా గ్రంధాల యం నిర్వాహకులు నల్ల మధుసూద నరావు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సాధారణ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.గ్రంథాలయాల్లోని దినపత్రికలు, మాసపత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మహనీయుల జీవిత చరిత్రలు చదవడం వల్ల వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు తెలిపారు.అనంతరం 'గ్రంథాలయాల ప్రాముఖ్యత - విద్యార్థుల పాత్ర'అనే అంశంపై విద్యా ర్థినులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థిను లు తమ అభిప్రాయాలను ఉత్సాహం గా పంచుకున్నారు.ఈకార్యక్రమంలో గురుకుల పాఠశాల మరియు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈకార్యక్రమంలో గురుకుల పాఠశాల గ్రంథాలయ అధికారి కోట మాధవి తదితరులు పాల్గొన్నారు.