యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు
రామాయంపేట ; రామాయంపేట పట్టణంలోని యంగ్ ఇండియా స్కూల్‌కు కేవలం 200 మీటర్ల సమీపంలో మైనింగ్ నిర్వహించేందుకు అనుమతిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామాయంపేట పట్టణంలోని సర్వే నంబర్ 1421లో మైనింగ్‌కు సంబంధించిన అనుమతులు, టెండర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి రద్దు చేయాలని కోరుతూ రామాయంపేట తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకునే పాఠశాలకు అతి సమీపంలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల వెలువడే దుమ్ము, ధూళి, భారీ వాహనాల రాకపోకలు, శబ్ద కాలుష్యం, పేలుళ్ల కారణంగా పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి, సమీప ప్రాంత ప్రజల జీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించాల్సిన పాఠశాల సమీపంలో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడం విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలిగించడమే కాకుండా ప్రజల భద్రతకు కూడా ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు ఈ అంశంపై తక్షణమే స్పందించాలని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మైనింగ్ అనుమతులు, టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రామాయంపేట పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, అక్కన్నపేట మాజీ ఎంపీటీసీ సిద్ధ రాములు, దంతపల్లి సర్పంచ్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మస్కూరు బాలరాజ్, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, రాయిలాపూర్ ఉపసర్పంచ్ ప్రశాంత్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శేఖర్, పట్టణ మాజీ అధ్యక్షులు భాను, పట్టణ ప్రధాన కార్యదర్శులు అక్కల అనిల్, ప్రవీణ్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మెంగర్తి రంగయ్య, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కటికే కార్తీక్, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు కన్నయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షులు నాగరాజు, సంతోష్, యువ మోర్చా నాయకులు అనిల్, సందీప్, మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శులు నాగరాజు, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.