అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
సంగారెడ్డి, ప్రతినిధి : అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించి పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోల్ నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి మండల కేంద్రంలో ఎస్ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిపల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. . రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజల ఆరోగ్యం, నాణ్యమైన విద్య, కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అనారోగ్యంతో కుటుంబాలు అప్పులపాలు కాకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, ప్రతి గ్రామంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేయాలని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందన్నారు. చేయూత పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, పేదలకు ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించే సామాజిక భద్రత అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.అందోల్ నియోజకవర్గంలోని 60 గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాలనే భావన లేకుండా ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో రోగులకు సత్వర వైద్య సేవలు అందేలా వైద్యులు, అంబులెన్సులు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. మునిపల్లితో పాటు కంకోల్, సింగీతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందించేలా, వైద్యులు, అంబులెన్సులు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.బుదేరా మహిళా కళాశాలలో అదనపు గదులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ నిధులతో పనులు చేపడుతున్నామని, సీఎస్ఆర్ నిధుల ద్వారా కూడా కళాశాల అభివృద్ధికి అదనపు నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సింగూరు బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని గ్రామాలకు రవాణా అనుసంధానం పెంచడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. పర్యాటక రంగం, రిసార్టుల అభివృద్ధితో స్థానికులకు, చిన్న వ్యాపారులకు ఉపాధి లభిస్తుందని వివరించారు.మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. మహిళలు పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ క్యాంటీన్లు తదితర వ్యాపార రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఆత్మన్యూనత, అభద్రతాభావాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం సాధనలో మహిళలు ముందంజలో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రజలకు సేవ చేయడమే తన రాజకీయ ప్రస్థానంలో ప్రధాన లక్ష్యమని తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారునికి చేరేలా చూడటమే అధికారుల లక్ష్యమన్నారు. పింఛన్ అనేది కేవలం డబ్బు మాత్రమే కాదని, దానితో లబ్ధిదారులకు ఆత్మవిశ్వాసం, భద్రత కలుగుతాయని పేర్కొన్నారు. మునిపల్లి మండలంలో 629 మందికి, రాయికోడ్ మండలంలో 584 మందికి కలిపి మొత్తం 1,213 మందికి నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 18,591 నూతన పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని లబ్ధిదారులకు సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి, కలెక్టర్ సూచించారు. ఈ నెల 19వ తేదీ నుంచి పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన అర్హులకు ఈ పథకం వర్తిస్తుందని, ప్రతి కుటుంబంలో ఒకరికి రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను అందజేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ వార్డుల పరిధిలో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఆన్లైన్లో వివరాల నమోదు ప్రక్రియ చేపడతారని తెలిపారు. ఈ ప్రక్రియనుఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జగదీశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సూర్యారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామ సర్పంచులు, మహిళా సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నూతన పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.