ఎన్జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి...
*అమలాపురం మేజర్ న్యూస్** ఎన్జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... మధ్యాహ్నం 3 గంటలకల్లా గ్యాస్ లీకేజీని విజయవంతంగా అరికట్టాం...
ముందస్తు జాగ్రత్తగా మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉంటాం...
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.…డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం నగరం గ్రామ సమీపంలోని తాటిపాక-7 ఓఎన్జీసీ వెల్ రిగ్ వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనను జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొందని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, పి గన్నవరం శాసనసభ్యులు గడ్డి సత్యనారాయణ తో కలిసి పాత్రికేయులు సమావేశం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి కుదురు మండలం గెద్దాడ నగర సమీపంలో తాటిపాక -7 రిగ్ గ్యాస్ లీకేజ్
మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని కలెక్టర్ వెల్లడించారు.
అదేవిధంగా గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలు చేపట్టిందని కలెక్టర్ వివరించారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యత.. 200 నుంచి 300 కుటుంబాల తరలిం చారు
రిగ్ చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో నివసిస్తున్న సుమారు 200 నుంచి 300 కుటుంబాలను తక్షణమే గుర్తించి సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించామని, అక్కడ వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని 216వ జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు వివరించారు.
ఉదయం 5 నుంచి 5.30 గంటల మధ్య గ్యాస్ నిలువుగా వెలువడినప్పటికీ ఎటువంటి అగ్నిప్రమాదం జరగకపోవడం ఊరటనిచ్చిందన్నారు.ఆరు ఫైర్ టెండర్లతో నిరంతర రక్షణ చర్యలుచేపట్టారు
ఉదయం 7.30 గంటలకల్లా నరసాపురం, ఓఎన్జీసీ బేస్ టీమ్లకు చెందిన అత్యవసర స్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. మొత్తం ఆరు అగ్నిమాపక శకటాల ద్వారా నిరంతరంగా వాటర్ కర్టెన్ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ రక్షణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
48 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ
మధ్యాహ్నం 3 గంటలకు ఓఎన్జీసీ సాంకేతిక బృందం గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టడంతో ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని కలెక్టర్ తెలిపారు. నిలిపివేసిన 216వ జాతీయ రహదారి రాకపోకలను, సమీప గ్రామాలకు విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించామన్నారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మరో 48 గంటల పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని, ఘటనా స్థలంలో మూడు అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అభినందనలు...ఈ సందర్భంగా పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డిసత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు తక్షణమే స్పందించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు తాను స్వయంగా వారిని పరామర్శించి భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
ఓఎన్జీసీ సాంకేతిక బృందం కృషితో మధ్యాహ్నం 3 గంటలకల్లా గ్యాస్ లీకేజీ పూర్తిగా అదుపులోకి రావడం, ఎటువంటి ప్రాణనష్టం లేదా అగ్నిప్రమాదం జరగకపోవడం సంతోషకరమన్నారు.సమన్వయంతో పనిచేసిన జిల్లా యంత్రాంగం, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా యంత్రాంగానికి ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృతజ్ఞతలుతెలిపారు ఈ సందర్భంగా ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ ముల్క మాట్లాడుతూ తాటిపాక-7 బావి వద్ద సాధారణ వర్క్ఓవర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్ లీకేజీ చోటుచేసుకుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల సహకారంతో అత్యంత తక్కువ సమయంలోనే లీకేజీని పూర్తిగా నియంత్రించగలిగామని వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని, ఓఎన్జీసీ సిబ్బందితో పాటు ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. సహాయక చర్యలకు సంపూర్ణ సహకారం అందించిన జిల్లా యంత్రాంగానికి, పోలీస్ శాఖకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. *రంబాల సత్యనారాయణ అమలాపురం *