నాయకత్వ బాధ్యతలకు వేళాయె!
మండల ప్రజా పరిషత్ పీఠంపైకి మరడాన నారాయణస్వామి
రేపు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం,పట్టాభిషేక మహోత్సవం
ప్రజాసేవలో నూతన అధ్యాయానికి శ్రీకారం..
శ్రేణుల్లో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు
గరుగుబిల్లి, నవంబర్ 17, మేజర్ న్యూస్:మండల రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.ప్రజాభి మానంతో, భారీ మెజారిటీతో గెలుపొం దిన ఉల్లిభద్ర ఎంపీటీసీ సభ్యులు మరడాన నారాయణస్వామి గురువారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ)గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరడాన నారాయణస్వామి పట్టాభిషేక మహోత్సవానికి మండల పరిషత్ కార్యాలయం సర్వాంగ సుంద రంగా ముస్తాబైంది.ఎంపీపీగా మరడాన నారాయణస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.గురువారం నిర్ణీత ముహూర్తానికి మండల పరి షత్తు అభివృద్ధి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎన్నికల అధికారుల సమక్షంలో మండల పరిషత్ అధ్యక్షులుగా మరడాన నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈకార్యక్రమానికి ఎంపీటీసీ సభ్యులు,వివిధ గ్రామాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు హాజరుకాను న్నారు.మరడాన నారాయణస్వామి ఎంపీపీగా గురువారం బాధ్యతలు చేపట్టనుండటంతో మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొంది.తమ అభి మాన నాయకుడికి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు.ప్రజా సమస్య ల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయ కుడు మరడాన నారాయణస్వామి ఎంపీపీ పీఠాన్ని అధిరోహిస్తుండటంతో మండల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.పారదర్శక పాలన అందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే లక్ష్యంగా కాబోయే ఎంపీపీ మరడాన నారాయణస్వామి ముందు కు సాగుతారని ప్రజలు విశ్వసిస్తున్నారు.