BREAKING
ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం... ఈనెల 19న సిద్దిపేట్ సీఎం సభను విజయవంతం చేయాలి... కట్టంగూర్ హైవేపై చీకట్లు :పది రోజులుగా వెలగని వీధిదీపాలు.. ప్రమాదాల భయం విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం

Select Suryaa Now
పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత"  పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం

రామాయంపేట ; పేదల జీవితాల్లో కొత్త వెలుగులు..  నింపాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం "చేయూత"పింఛన్ల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు.నియోజకవర్గంలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా జరిగాయి. *మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు* స్వయంగా పలు మండలాలు, గ్రామాలు, మెదక్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.పేదల కళ్లలో ఆనందం.. చూడాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వ సంక్షేమం మెదక్ నియోజకవర్గంలో ఘనంగా చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా నిరుపేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో జీవించేందుకు తోడ్పడే భరోసా అని పేర్కొన్నారు.
నార్సింగి మండలంలో పింఛన్ల పంపిణీ చేశారు.

నార్సింగి మండలంలోని నాలుగు గ్రామాలకు సంబంధించిన*  86 నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు రైతు వేదికలో ఎమ్మెల్యే పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

రామాయంపేట పట్టణం, మండలంలో పింఛన్ల పంపిణీ.

రామాయంపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో రామాయంపేట పట్టణం,142 మండల పరిధిలోని  323 నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధాప్యంలో కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా, పేదలకు నెలనెలా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

నిజాంపేట మండలంలో చేయూత పింఛన్లు పంపిణి.

నిజాంపేట మండలానికి చెందిన 257 నూతన పింఛన్ లబ్ధిదారులకు రేణుక ఫంక్షన్ హాల్‌లో పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే చేయూత పింఛన్లు నిరుపేద కుటుంబాలకు ఎంతో ముఖ్యమైన ఆర్థిక ఆధారమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మండల అధ్యక్షులు బండారి మహేందర్ రెడ్డి వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పోచమ్మ నవనీత గణేష్ కౌన్సిలర్సు, దేవుని రంజిత్ సందీప్ సందీప్ దాకి శ్యామల స్వామి బైరం స్వప్న కుమార్ రవి నాయక్ సర్పంచ్ పోరం అధ్యక్షుడు రామకృష్ణయ్య వెంకటాపూర్ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు