BREAKING
ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం... ఈనెల 19న సిద్దిపేట్ సీఎం సభను విజయవంతం చేయాలి... కట్టంగూర్ హైవేపై చీకట్లు :పది రోజులుగా వెలగని వీధిదీపాలు.. ప్రమాదాల భయం విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

మెరుగైన వైద్య సేవలే ద్యేయంగా ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించాలి

Select Suryaa Now
మెరుగైన వైద్య సేవలే ద్యేయంగా ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించాలి

 

మాతాశిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిఎంహెచ్ఓ

పార్వతీపురం, నవంబర్17 : మేజర్ న్యూస్ :
మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఆరోగ్య కార్యక్రమాలను పక్కగా నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారo ఆశా నోడల్ అధికారులకు ఆరోగ్యశాఖ కార్యాలయoలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ, ప్రోగ్రాం అధికారులు సమావేశంలో పాల్గొని వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఆర్.సి.హెచ్ లో గర్భిణీ, శిశు నమోదు ,ఈ ఆశా అప్లికేషన్ లో మాతాశిశు సేవల నివేదికల నమోదు త్వరగా చేయాలని, ఆశా ల నెలవారీ హాజరు సకాలంలో సమర్పించాలన్నారు. గర్భిణుల నమోదు వెంటనే అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి ఎంసిపి కార్డులో నమోదు చేయాలన్నారు. అనీమియా ముక్త భారత్, పిఎంఎస్ఎంఎ, సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు, ఆరోగ్య పర్యవేక్షణ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. పిహెచ్సీ ప్రసవాలు మెరుగు పర్చాలన్నారు. హెచ్.పివి , ఎం.ఆర్ టీకాలు శత శాతం సాధించాలని ఆదేశించారు. న్యూమోనియా, ఇతర శ్వాస వ్యాధులను గుర్తించే లక్ష్యంగా శాన్స్ ప్రోగ్రాం ఫిబ్రవరి నెలాఖరు వరకు నిర్వహించాలన్నారు. న్యూ బోర్న్ వీక్ ను అన్ని పిహెచ్సీ ల పరిధిలో నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. లెప్రసీ సర్వే పెండింగ్ ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎన్.సి.డి యాన్యువల్ సర్వే కొరకు సంబంధిత సిబ్బంది రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు.  పాఠశాల విద్యార్థుల ఆర్.బి.ఎస్.కె స్క్రీనింగ్ సకాలంలో పూర్తి చేస్తూ 4డి లక్షణాలు గుర్తించాలన్నారు.  హాస్టల్స్ ను వైద్య సిబ్బంది తరచుగా సందర్శించి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించాలన్నారు. మలేరియా హైరిస్క్ గ్రామాల్లో లార్వావేట, మా ఊరికి మలేరియా వచ్చింది, డ్రైడే, ఫోకల్ స్ప్రేయింగ్, ఏఎల్ఓ చర్యలను శాఖల సమన్వయంతో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డా వై. విజయ్ మోహన్, డిఎల్ఏటిఓ డా. షేక్ హఫీజా , ఆర్.బి.ఎస్.కె పిఓ డా. టి.  జగన్ మోహన్ రావు, డా. గుణశ్రీ, డిపిఓ లీలారాణి, డిపిహెచ్ఎన్ఓ విజయలక్ష్మి, డిసిఎం విజయలత తదితరులు పాల్గొన్నారు.